జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల నేపద్యంలో రాజకీయ పార్టీలు నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. అసత్య ప్రచారాల కారణంగా హైదరాబాద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు.

ఏ రాజకియ పార్టీ నాయకుడైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినా,ప్రజలను ప్రలోబ పెట్టె విదంగా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడతామని పోలీస్ కనిషనర్ హెచ్చరించాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున అసత్య కథనాలు ప్రచారం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ..

 ‘‘హైదరబాద్ లో ఎన్నికలు వస్తూ, పోతుంటాయి కానీ నగరవాసులు శాశ్వతంగా ఉండేవారు. ప్రచారాలలో విద్యేషపూరిత మాటలు మాట్లాడుతూ.. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు అని ఆయన మండిపడ్డారు . సోషల్‌ మీడియా వచ్చే అసత్య ప్రచారాలు నమ్మకండి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం’’ అని పోలీస్ కమిషనర్ అంజని కుమార్ హెచ్చరించాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: