పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ-ఎంఐఎంలు తుచ్ఛరాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గం అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోంది అని ఆయన ఎద్దేవా చేసారు. నిజంగా పీవీ, ఎన్టీఆర్ లపై బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేసారు.

29న నగరానికి వస్తోన్న అమిత్ షా ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలి అన్నారు. ప్రతి రోజు రాత్రి బండి సంజయ్, అరవింద్ – అసద్, అక్బర్ ల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోంది... దీనికి సంధానకర్త అమిత్ షా అని విమర్శించారు. రాత్రి పూట అంతా కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకోవడం... ఉదయం సరుభి నాటకానికి తెర లేపడం... ఇదే జరుగుతోంది అని ఆయన విమర్శించారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: