గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బి‌జే‌పి తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది.బి‌జే‌పి కి ప్రదాన ప్రత్యర్థి పార్టీ అయిన టి‌ఆర్‌ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు హైదరబాద్ వాసులకు వారాల జల్లు ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోను తయారు చేసినట్లు తెలుస్తుంది.ఈ మ్యానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవంద్ర ఫడ్నవిస్‌ గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా వ్యాక్సిన్ ను ప్రదాన అస్త్రంగా ఉపయోగించి ఎన్నికల్లో దూసుకుపోయారు.మళ్ళీ ఈ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఉచిత కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రయోగాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కాషాయదళం నిర్ణయించుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాద్‌ ప్రజలందరికీ ఉచిక కరోనా టీకాను అందిస్తామని హామీనిచ్చింది. అంతేకాకుండా విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్‌, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామని మ్యానిఫెస్టోలో తెలిపింది.

దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ  అందరి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేనిఫెస్టో ఉంటుందని ఫడ్నవిస్‌ అన్నారు. పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలకు అందరికీ అనుకూలంగా  మేనిఫెస్టో రూపొందించ బడిందని పేర్కొన్నారు.మరి దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి ఫుల్ జోష్ లో వున్న బి‌జే‌పి అంతే ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది.మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: