జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించాడు.బి‌జే‌పి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదంతా గ్రేటర్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కే‌సి‌ఆర్ ఇతరులపై నిందలు మోపుతున్నాడు అని ఆయన అభిప్రాయ పడ్డాడు.

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా కే‌సి‌ఆర్ ఇలాంటి ఆరోపణలే చేశాడని గుర్తు చేశాడు. ఇతరులపై బురద చల్లడం ప్రజలకు అపనమ్మకం కలిగించేలా మాట్లాడడం ఎంత వరకు సమంజసమో సి‌ఎం గారు ఆలోచించాలి అని ఆయన అన్నారు. ఇదేం నిజాం రాజ్య పాలన కాదని అధికారం ఎవరికి శాశ్వతం కాదని అన్నారు తెలంగాణ ప్రజలు కే‌సి‌ఆర్ కుటుంబానికి శాశ్వత అధికారం కట్టబెట్టినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు మీకు బుద్ది చెప్పే రోజులు దగ్గరలో వున్నాయని అన్నారు.

 జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించేందుకే అధికారులను ఉసిగొల్పుతున్నదని కిషన్ రెడ్డి ఆరోపించారు. అలగే పి‌వి,ఎన్‌టి‌ఆర్ సమాధులు కూల్చలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఆయన తీవ్ర స్తాయిలో మండిపడ్డాడు . 

మరింత సమాచారం తెలుసుకోండి: