గ్రేటర్ ఎన్నికల సందర్బంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి.తాజాగా బి‌జే‌పి మ్యానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సి‌ఎం బి‌జే‌పి కీలక నేత అయిన దేవేంద్ర ఫడ్నవిస్ గారు విడుదల చేశారు.ఐతే ఈ మ్యానిఫెస్టో పై కే‌టి‌ఆర్  ట్విటర్ వేదికగా  వ్యంగాస్త్రాలు సంధించారు.తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఫొటోలను జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.

ఈ ఫొటోలను వాడటం మా ప్రభుత్వానికి ప్రతిపక్షం నుండి దక్కిన ప్రశంసలుగా భావిస్తున్నామన్నారు.తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలను తమ మ్యానిఫెస్టో లో కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని బీజేపీ నాయకులను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. బల్దియాలో అధికారంలోకి వస్తే  ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ  ముఖ్యంగా తెలిపింది. 

గ్రేటర్‌ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందిస్తామని, లక్ష మందికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద సామాన్యుని సొంతటి కలను నెరవేరుస్తామని పెర్కొంది.  విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్‌, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామంది. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. ఇవన్నీ కూడా తమ నుండి కాపీ కొట్టినవేనని బి‌జే‌పిపై వ్యంగస్రాలు సంధిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: