గ్రేటర్ ఎన్నికల నేపద్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాలలో వేగం పెంచాయి.గ్రేటర్ ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు పోటీలో ఉన్నపటికి ప్రదాన పోరు మాత్రం టి‌ఆర్‌ఎస్,బి‌జే‌పి ల మద్య ఉండనున్నట్లు తెలుస్తుంది.దీంతో రెండు ప్రదాన పార్టీలు కూడా ప్రచారాలలో వేగం పెంచాయి. అధికార టీఆర్ఎస్‌ పార్టీ తమ మార్క్ ప్రణాళికలతో కే‌టి‌ఆర్ వాక్చాతుర్యంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత నగరంలో విసృత పర్యటనలు చేస్తున్నారు. పలు సమ్మేళనాలు, రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొంటున్నారు.

 ముఖ్యంగా  ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి ప్రతిరోజు ఐదు నుంచి ఆరు రోడ్‌ షోలలో పాల్గొంటూ..కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబూ అవుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.  సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.

 తరువాత మంత్రి .. మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి  నియోజకవర్గాల్లో విసృత ప్రచారం. ముందుగా అల్వాల్‌లోని ఇందిరాగాంధీ చౌరస్తాలో రోడ్ షో పాల్గొన్న ఆయన బీజేపీ, కాంగ్రెస్‌పై తన మార్క్ పంచ్‌లతో ఆకట్టుకున్నారు.మేము ప్రజలకు అభివృద్ది చేసి చూపించి ఓట్లు అడుగుతామన్నారు.ప్రజలకు కల్ల బొల్లి మాటలు చెప్పి మబ్యపెట్టే వాళ్ళం కాదన్నారు.ఈ విధంగా ప్రచారాలను హోరెత్తిస్తూ కే‌టి‌ఆర్ దూసుకుపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: