గ్రేటర్ ఎన్నికల నేపద్యంలో రాజకీయ పార్టీలు నగరంలోని ప్రతి డివిజన్ లో ప్రచారలతో హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అన్నీ రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా చేసుకుని ఒకరి పై ఒకరు చేసుకుంటూ రణరంగాన్నితలపించేలా ప్రచారాలలో జోరు చూపిస్తున్నారు.అయితే ప్రతి ఒక్క అభ్యర్థి ప్రచారం పై పోలీసులు నిఘా ఉంచినట్టు రాచకొండ సీపీ తెలిపారు.ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో 4వందలకు పైగా అభ్యంతరకరమైన  పోస్టింగ్ లను గుర్తించినట్టు తెలిపారు.

 వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని రాచకొండ సీపి మహేశ్ భగవత్ తెలిపారు. కొందరు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, పోస్టింగ్ లతో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతిభద్రతలు కు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే వారెవరైనా సరే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించాడు. రాచకొండ పరిధిలో 30 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి.

 498 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు, 101 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే రాచకొండ పరిధిలో మొత్తం 8 వేల మందితో ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే 711 లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వాళ్ళలో 543 డిపాజిట్ అయ్యాయి. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారంతా 29 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి తిరిగి వెళ్లిపోవచ్చని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: