పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేశ్... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీ నిధులను మళ్లించి పూలే స్ఫూర్తికి తూట్లు పొడిచింది అని చంద్రబాబు  వ్యాఖ్యలు చేసారు. ఆదరణ, విదేశీవిద్య, పెళ్లి కానుక తదితర పథకాలన్నీ జగన్ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. అన్నా కేంటిన్లు మూసేసి పేదల పొట్టకొట్టింది అని చంద్రబాబు  మండిపడ్డారు.

ఇసుక మాఫియా దోపిడితో లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే దుస్థితి తెచ్చారు అన్నారు. బీసీలకు వైకాపా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అని సూచించారు. వారి హక్కుల సాధనకు పునరంకితమై పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి అని,  జ్యోతిరావు పూలె, మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసమే ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారు అన్నారు. పార్టీకి బీసీలు ఉండగా ఉంటున్నారనే అక్కసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: