గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ గారు ఎల్‌బి స్టేడియం లో భారీ బహిరంగసభ నిర్వహించారు.ఈ సందర్భంగా కే‌సి‌ఆర్ పలు అంశాలపై ప్రసంగించారు. మన తెలంగాణను సాధించుకోవడానికి 2001 నుండి ఉద్యామిస్తే సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు.

రాష్ట్రం అంధకారమౌతుదని ,నీళ్ళు రావని ఎంతో మంది శాపాలు పెట్టిన తెలంగాణ ప్రజలు ధీవించి టి‌ఆర్‌ఎస్ కు అధికారం కట్టబెట్టారని అన్నారు.కే‌సి‌ఆర్ "ఒక ఉద్యమ కారుడు " ఆయన ప్రసంగాలకు ప్రజలు చెవి కోసుకుని వినేవారని, దేశం ఆశ్చర్య పోయే సభలు,లక్షల్లో జనం వచ్చేవారని అన్నారు.ఆ ఉద్యమలే రాష్ట్రం వచ్చేలా చేసిందన్నారు.

ఎన్నికల్లో ఓటు వేసే ముందు నేతల పనితీరును ప్రజలు ఆలోచించి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.ప్రభుత్వం,నేతలు అబివృద్ది చెయ్యగలరా..లేదా ..ఎలాంటి పద్దతిలో నాయకులు ముందుకు వెళ్తున్నారు అనేవి ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.హైదరబాద్ ఎంతో చరిత్ర,చైతన్యం కలిగిన నగరమని ఎన్ని మంచి చెడ్డలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: