గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార అంఖం ముగిసింది. గత ఐదు రోజులుగా రాజకీయ పార్టీలు ప్రచారలతో హోరెత్తించాయి.ఈ రోజుతో(ఆదివారం )ప్రచార సమయం ముగిసిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కనిషనర్ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..

జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత ఎవరైనా ప్రచారం చేస్తే వారికి రెండేళ్ల పాటు జైలు శిక్ష,జరిమానా విధించనున్నట్టు స్పష్టం చేశారు.ప్రచార నిమిత్తం వచ్చిన బయటి వ్యక్తులు వెంటనే జి‌హెచ్‌ఎం‌సి పరిధి ధాటి వెళ్లాలని ఆదేశించారు.అంతే కాకుండా డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం పై నిషేదం విదించినట్టు తెలిపారు. జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు.

వారిలో 38,89,637 మంది పురుషులు35,76,941 మంది మహిళలు 678 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. మొత్తంగా 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పోలింగ్ కేంద్రాలలో కరోనా కు సంబందించి అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు వెల్లడించారు.కరోనా పెసెంట్స్ కోసం,వికలాంగుల కోసం,వృద్దుల కోసం సపరేట్ క్యూ లైన్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు ను వినియోగించుకోవలని విజ్ఞప్తి చేశారు.   .

మరింత సమాచారం తెలుసుకోండి: