ఎన్నికల కమిషన్ టి‌ఆర్‌ఎస్ పక్షంగా వ్యవహరిస్తోందని,టి‌ఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల రూల్స్ వర్తించవా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బి‌జే‌పి ఎమ్మెల్యే రాజాసింగ్.టి‌ఆర్‌ఎస్ వాళ్ళు ఓట్ల కోసం గత రాత్రి నుండి బహిరంగంగానే డబ్బు,మద్యం పంచుతున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ఎన్నికల కమిషన్ ఎక పక్షంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.పోలీసులు టి‌ఆర్‌ఎస్ పార్టీకి తొత్తుల్ల మారిపోయారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.పైగా బి‌జే‌పి కార్యకర్తలను లక్షంగా చేసుకొని లాఠీ చార్జ్ లు చేస్తున్నారని,మైలార్ దేవ్ పల్లి లో ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు.టి‌ఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసిన గ్రేటర్ ఎన్నికల్లో బి‌జే‌పి గెలుపును ఆపలేరంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా వుండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యలయం ముందు పలు బి‌జే‌పి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.ఎన్నికల సంఘం ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటూ దర్నాకు దిగారు.టీచర్లకు ఎన్నికల నిర్వహణ విధులు ఎందుకు అప్పగించలేదు అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రగునందన్ రావు,ఎం‌ఎల్‌సి రామచంద్ర రావు ,పలువురు బి‌జే‌పి నేతలు కే‌సి‌ఆర్ కు వ్యతిరేకంగా నినాధాలు చేశారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: