ఏపీలో ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఉద్యోగులు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ఏపీ సిఎం వైఎస్ జగన్ చర్యలు చేపడుతున్నారు. కరోనా సమయంలో కూడా ఉద్యోగులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఏపీ సర్కార్ ముందుకు అడుగులు వేసింది. ఇక తాజాగా ఏపీలో ఉద్యోగులకు సిఎం జగన్ గుడ్ న్యూస్  చెప్పారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పెండింగ్ జీతాలు చెల్లింపు జీ.ఓ విడుదల చేసారు. కోవిడ్ సమయం లో మినహాయించిన మార్చ్ నెల జీతాలను డిసెంబర్ లో  ఇస్తామని ఏపీ సర్కార్ పేర్కొంది. ఏప్రిల్ నెల జీతాలను వచ్చే ఏడాది జనవరిలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు విడుదల చేసింది సర్కార్. ఈ మేరకు ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్ ఎస్ రావత్ ఆదేశాలు విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: