దేశ రాజధాని ఢిల్లీ  సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనపై కెనడా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. మంగళవారం ప్రధాని జస్టిన్ ట్రూడో మరియు కొంతమంది కెనడా నాయకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. భారత్ లో జరుగుతున్న రైతుల నిరసనపై తాను స్పందించాల్సిన సమయం వచ్చింది అని, పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని, మన స్నేహితులు కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారని కెనడా ప్రధాని ట్రూడో అన్నారు.

దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది భారతదేశం యొక్క అంతర్గత విషయం... అనవసరమైన వ్యాఖ్యలు చేసారు అని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశం యొక్క అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవి అని ఆయన  పేర్కొన్నారు. ఆ దేశ కేబినేట్ లో కూడా సిక్కులు ఎక్కువగా ఉన్నారు. సిక్కు జనాభా ఎక్కువగా ఉండటంతో ఆయన వారికి మద్దతుగా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: