న్యూఢిల్లీ: బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ప్రతి ఏడాది దాదాపు 4 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇక బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే.. గత ముఫ్పై ఏళ్లలో భారత్‌నుంచి చైనా ఎప్పుడూ బియ్యాన్ని చేసుకోలేదు. రెండు, మూడు సార్లు చేసుకున్నా.. అది కూడా అంతంతమాత్రమే. నాణ్యత లేదనీ, ధర ఎక్కువనీ సాకులు చెప్పేది. థాయ్‌ల్యాండ్, వియత్నామ్, మయాన్మార్, పాకిస్థాన్‌ల నుంచే ఎక్కవగా బియ్యం కొనుగోలు చేసేంది. అయితే ఈసారి మాత్రం చైనా లెక్కలు గల్లంతయ్యాయి. ఆ దేశానికి కావలసిన బియ్యాన్ని సమకూర్చుకోలేకపోయింది. ఆయా దేశాల్లో ఎగుమతికి అవసరమైన నిల్వలు లేకపోవడం, టన్ను బియ్యానికి వారు మన కంటే 30 డాలర్లు ఎక్కువగా తీసుకుంటుండడంతో చైనాకు దిమ్మతిరిగింది. దీంతో చేసేందేం లేక మళ్లీ భారత్ పంచన చేరింది.

చైనా కోరిక మేరకు భారత్‌కూడా బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. అంతేకాదు ఇక్కడ కూడా భారత్ తన పెద్ద మనసు చాటుకుంది. మిగతా దేశాలకంటే తక్కువ ధరకే చైనాకు బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఒప్పుకుంది. ఇప్పటివరకూ లక్ష టన్నుల బియ్యం కోసం ఇక్కడి వ్యాపారులతో చైనా వర్గాలు ఒప్పందాలు చేసుకున్నట్లు భారత ఎగుమతి దారుల సంఘం ద్వారా తెలుస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా. టన్ను బియ్యానికి 300 డాలర్లు చొప్పున ఈ సప్లై జరగనుంది. భారత్ ఎగుమతుల్లో నాణ్యత గనుక పెరిగితే.. వచ్చే ఏడాది మరింత పెద్ద మొత్తం దిగుమతి చేసుకుంటామని చైనా నుంచి సమాచారం అందిందట.


గత ఏడెనిది నెలలుగా చైనా మనతో తెగ తగువుపడుతోంది. నెపాల్, పాకిస్థాన్ దేశాలను మనపైకి చైనా ఉసిగొల్పుతోంది. ‘ప్రపంచంలో మా అంతవారు లేరు’ అని విర్రవీగే చైనా ప్రస్తుతం బియ్యం కోసం భారత్ సహాయం అర్థంచడం ఆనందించదగిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: