టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రసంశల వర్షం కురిపించాడు. కాన్బెర్రాలో బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, ఆఖరి వన్డేలో కోహ్లీ ఆట తీరుపై హర్షం వ్యక్తం చేసాడు. గత 7 రోజులుగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ రెండు ప్రధాన బ్యాటింగ్ మైలురాళ్లను చేరుకున్నాడు. నవంబర్ 29 న సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో అంతర్జాతీయ క్రికెట్‌ లో 22000 పరుగులు సాధించాడు.

మనుకా ఓవల్‌ లో జరిగిన మూడో మ్యాచ్‌ లో 12000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. రెండు సందర్భాలలో, కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి వేగంగా పరుగులు సాధించాడు. పదేళ్ల వ్యవధిలో 20,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ గా అవతరించాడు. మీరు ఎలా అయినా అర్ధం చేసుకోవచ్చు. కాని అతను సూపర్ బ్యాట్స్మెన్ అన్నాడు. కాన్బెర్రా వన్డేలో ఆస్ట్రేలియాపై 13 పరుగుల తేడాతో విజయం సాధించాడు. కోహ్లీ 63 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: