అంతా అనుకున్నట్టే జరిగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజల నాడీ తెలుసుకోవడానికి పలు ప్రాధాన్యం ఉన్న సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలలో టి‌ఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.అన్నీ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఇప‍్పటివరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ రిపోర్ట్ ప్రకారం అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ విజయ ఢంఖా మోగించింది.జే‌బి‌పి నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ టి‌ఆర్‌ఎస్ ముందుకు దూసుకుపోయింది.ఎక్స్ అఫిసియో సభ్యుల సపోర్ట్ లేకుండానే బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోనుంది.

బి‌జే‌పి తమ పార్టీ ఊహించిన ఫలితాలు రాకున్న మెరుగ్గానే ఓట్ల శాతం సంపాదించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక మజ్లిస్‌ పార్టీ దాదాపుగా 40 కి పైగా సీట్లలో గెలవనుంది.‘పీపుల్స్‌ పల్స్‌’  సర్వే ఫలితాల ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 70-79 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్‌కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. ప‍్లస్‌ ఆర్‌ మైనస్‌ మూడు శాతం. టీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ (76)కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.మిగిలిన ప్రముఖ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి....

ఆరా సర్వేలో టీఆర్‌ఎస్‌కు సొంతంగా అధికారం (78),పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో బీజేపీకి టీఆర్‌ఎస్‌కు 68 నుంచి 78,సీపీఎస్‌సర్వేలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ (82 నుంచి 96),ఆత్మసాక్షి సర్వేలో టీఆర్‌ఎస్‌కు భారీ సీట్లు (82 నుంచి 88) ,. దాదాపుగా అన్నీ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో టి‌ఆర్‌ఎస్ పార్టీ కే పట్టం కట్టాయి.మరి రేపు విడుదల అయ్యే అసలైన ఫలితాలు ఎలా ఉంటాయన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: