ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు అవుతుంది. కాసేపటి క్రితం కౌంటింగ్ మొదలయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. 150 డివిజన్లకు 30 సెంటర్లలో కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్  సెంటర్ల  వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసారు. 50 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. కౌంటింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరం వరకు 144 సెక్షన్  విధించారు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ కొత్త సర్క్యులర్ పై బీజేపీ న్యాయ పోరాటంకు దిగింది. పెన్నుతో గీసినా ఓటు వేసినట్లేనని ఎస్ఈసి సర్క్యులర్ పేర్కొంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ ను సీజే ధర్మాసనం విచారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: