చందానగర్ కౌంటింగ్ సెంటర్‌ లో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వివాదాస్పదంగా మారింది. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని అధికారులు మీడియాకు అందించకపోవడం వివాదాస్పదంగా మారింది. సమాచారం కోసం ఫోన్ చేసినప్పటి అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనితో మున్సిపల్ అధికారుల తీరుపై మీడియా ప్రతినిధులు, ఏజెంట్లు ఆగ్రహంగా ఉన్నారు.

ఇక పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి ఊహించని విధంగా ఆధిక్యం సాధించింది. పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మజ్లీస్ కి 12 స్థానాల్లో ఆధిక్యం వచ్చింది. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.  ఇక బిజెపి పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యం సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  ఇక కాసేపటి క్రితం  తొలి రౌండ్ ఓట్లు మొదలయ్యాయి. మూడు పార్టీల మధ్యనే పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: