గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో తెరాస పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తుంది. గ్రేటర్ లో ఇప్పటి వరకు తెరాస పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించి 57 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మజ్లీస్ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఇక మజ్లీస్ పార్టీ 22 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా బిజెపి 21 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. 

గోల్నాక సహా పలు డివిజన్ లలో బిజెపి దూసుకుపోతుంది. బిజెపి తనకు పట్టున్న ప్రాంతాల్లో  ఆధిక్యంలో ఉంది. ఆయా స్థానాల్లో ఆ పార్టీ కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. యూసఫ్ గూడలో తెరాస పార్టీ విజయం సాధించింది. మెట్టుగూడలో తెరాస పార్టీ విజయం సాధించింది. హబ్సీ గూడ చిలుక నగర్ లో తెరాస పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: