జీఎచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా.. టీఆర్‌ఎస్‌పార్టీ  రెండో స్థానంలో నిలిచింది.  పలు డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ మెట్టుగూడలో తొలి విజయం నమోదు చేసుకుంది. బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది జిహెచ్ఎంసి ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. మొదట ఒక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన అప్పటినుండి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగింది.

పోస్టల్ బ్యాలెట్ లలో బిజెపి పూర్తి ఆధిక్యం కనబరిచింది. అయితే ఇవి అసలైన ఓట్లు కాకపోవడంతో గెలుపును అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాలెట్ లెక్కింపు కావడంతో ఎన్నికల ఫలితాల వివరణలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. అయితే విడుదలైన తొలి రౌండ్ ఫలితాల ప్రకారం టిఆర్ఎస్ ఆధిక్యం కనబరుస్తుంది. ఇప్పటివరకు 150 స్థానాలకు  కౌంటింగ్ జరుగుతూ ఉండగా ఇందులో దాదాపుగా 40 స్థానాలలో టిఆర్ఎస్ ఆధిక్యం కనబరుస్తుంది.

రెండు చోట్ల పూర్తి గెలుపు సొంతం చేసుకుంది. బిజెపి 20  స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరవలేదు. ఎంఐఎం పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా మెహదీపట్నం లో తొలి గెలుపు నమోదు చేసింది.  కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇవి తొలి రౌండ్ కు సంబంధించిన సమాచారం. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండడంతో ఫలితాలపై పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది..

మరింత సమాచారం తెలుసుకోండి: