గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  బిజెపి  కొన్ని నియోజకవర్గాల్లో మంచి ఆధిక్యం చూపిస్తుంది. సరూర్ నగర్  డివిజన్ లో బిజెపి ఆధిక్యంలో ఉంది.  టీఆర్ఎస్ అభ్యర్థికి 5,136 ఓట్లు రాగా  బిజెపి అభ్యర్థి కి 7662 ఓట్లు వచ్చాయి.. మొదటి రౌండ్లో బిజెపి ఆధిక్యం 2526... ఆర్.కె.పురం డివిజన్ లో టీఆర్ఎస్ 4,972 ఓట్లు రాగా బీజేపీ 7,245 ఓట్లు వచ్చాయి.  బీజేపీ ఆధిక్యం 2,273 ఓట్లు వచ్చాయి.

చైతన్యపురి డివిజన్ టిఆర్ఎస్ 4009 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 8,335 ఓట్లు వచ్చాయి.  బీజేపీ ఆధిక్యం 4326 ఓట్లు వచ్చాయి. గడ్డి అన్నారం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థికి 4042 ఓట్లు రాగా బీజేపీకి 7426 ఓట్లు వచ్చాయి.  బిజెపి అభ్యర్థి ఆధిక్యం 3384. కీలక స్థానాల్లో బిజెపి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుంది. కొన్ని చోట్ల విజయాలు నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: