పీసీసీ పీఠాన్ని నేను కూడా ఆశిస్తున్నా  అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీసీసీ పదవి శ్రీధర్ బాబు కి ఇచ్చిన నాకు అభ్యంతరం లేదు అని ఆయన స్పష్టం చేసారు.  మా మధ్యలో బేధాభిప్రాయాలు లేవు  అన్నారు.  పీసీసీ ఎవరికిచ్చినా అందరూ కలిసికట్టుగా పని చేస్తాం అని వెల్లడించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ని బతికించుకోవడమే మా లక్ష్యం అని ఆయన అన్నారు.

 సోనియా గాంధీ పీసీసీ గా ఎవరిని నియమించినా కలిసి పని చేస్తాం అని ఆయన వెల్లడించారు. నాకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రేవంత్ రెడ్డి కూడా కలిసి పనిచేస్తానని చెప్పారు అన్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ బాధ్యతల నుంచి ఉత్తమ కుమార్ రెడ్డి తప్పుకున్నారు. దీనితో ఆ పదవి ఎవరికి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: