కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు.. ఈ దేశ చరిత్రలో ఎవరూ ఎన్నడూ చేయని విధంగా తాము.. అనేక కార్యక్రమాలు చేస్తున్నామని.. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైన వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చా మని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ లు.. కొవాగ్జిన్ కొవిషీల్డ్లను అందిం చే కార్యక్రమానికి మోడీ శ్రీకారం చుట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పంపిణీ కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది.ఈ క్రమంలో ఆయన తొలి ప్రాధాన్యం కరోనా వారియర్స్కేనని ప్రకటించారు.


విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి లో ఈ ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఓ చిన్న అపశృతి దొర్లింది. వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకున్న ఓ మహిళా హెల్త్ వర్కర్ స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. కళ్లు తిరిగి కిందపడ్డారు. వ్యాక్సిన్ వేయించుకున్న కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కలకలం చెలరేగింది. డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించారు. బ్లడ్ ప్రెషర్, షుగర్ పరీక్షలను చేశారు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి.నీరసంగా ఉండటం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ఈ ఉదయం వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- విజయవాడ జీజీహెచ్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇంజెక్షన్ వేసుకున్న కొద్ది సేపటికే ఆమె స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. తొలుత చలి వేస్తున్నట్లు చెప్పిన రాధా.. ఆ వెంటనే కళ్లు తిరిగి కింద పడ్దారు. డాక్టర్లు, తోటి హెల్త్ వర్కర్లు ఆమెను బెడ్‌పైకి తీసుకెళ్లారు. సపర్యలు చేశారు. కొద్దిసేపటి తరువాత రాధ స్పృహలోకి వచ్చారు. ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. అన్నీ నార్మల్ రిపోర్టులు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే ..వ్యాక్సిన్ వేసుకుంటే.. నపుంసకులు అవుతారని.. మహిళలైతే.. గర్భం దాల్చే శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయని.. నరాల బలహీనత వస్తుందని... కేన్సర్కు సైతం దారితీసే పరిస్థితిని కొట్టిపారేయలేమని.. అనేక అధ్యనాల్లో తేలుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: