ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుండి తనదైన శైలిలో వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.పాలనా పరంగా కూడా దేశవ్యాప్తంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు పెద్ద హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి.చాలా వరకు ప్రభుత్వ వ్యవస్థల పనులు ప్రజల వద్దకే అన్నట్టు జగన్ పాలన సాగిస్తున్న నేపథ్యంలో.ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పెద్దలు కూడా ఏపీ లో జరుగుతున్న పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది.ఇదిలా ఉంటే విజయవాడ నడిబొడ్డులో అప్పట్లో 108, 104 ఆంబులెన్స్ వాహనాలు వేలల్లో రిలీజ్ చేసి దేశవ్యాప్తంగా జగన్ హాట్ టాపిక్ అవ్వటం అందరికీ తెలిసిందే.అయితే  మరో   పథకం అమలుకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్ . ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను లాంఛనంగా  జెండా ఊపి  ప్రారంభించారు .

 విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈ వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఏపీలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలు సేవ‌లందిస్తాయి. ఇవ‌న్నీ జ‌గ‌న్ చేతుల మీదుగా ప్రారంభ‌మ‌య్యాయి. ఏపీలోని మిగ‌తా జిల్లాల్లో ఆ వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. ఈ రోజు మొత్తం 9,260 వాహనాలు ప్రారంభం అయ్యాయి .అధునాతన తూకం యంత్రాలు, అనౌన్స్ మెంట్ కిట్, క్యాష్ బాక్స్, ఫ్యాన్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి హంగులతో వున్నాయి ఈ వాహనాలు .

సంవత్సరానికి 830 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది.నాణ్యతపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి.. స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది.ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధలో అనేక సమస్యలు ఎదురవుతుండటంతో పాటు.. కొంతమంది దుకాణదారులు సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోజువారీ కూలీలు రేషన్ తెచ్చుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మొబైల్ వాహనంతో రేషన్ పంపిణీ విధానాన్ని మొదలు పెట్టింది .వాలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖచ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేస్తారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇస్తారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్‌ ఉంటుంది.ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు చేరే విధంగా రేషన్ డోర్ డెలివరీ అనే వినూత్న కార్యక్రమానికి జగన్ రెడీ అవటంతో ఏపీ ప్రజలు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: