మ‌న‌దేశంలో క‌రోనా కేసులు మళ్లీ జోరందుకున్నాయి. మ‌ళ్లీ గ‌తేడాది మార్చికి ముందు లాక్‌డౌన్ ప్రారంభ స‌మ‌యంలో ప‌రిస్థితులే ఇప్పుడు మ‌ళ్లీ తలెత్తుతున్నాయి. క‌రోనా త‌గ్గినా కొత్త ర‌కం క‌రోనా కేసుల విజృంభ‌ణ మాత్రం ఆగ‌లేదు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల్లో 75 శాతం కేసులు మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌లోనే ఉన్నాయి.  కేరళ నుంచి 38%, మహారాష్ట్ర నుంచి 37%, కర్ణాటక 4%, తమిళనాడులో 2.78% యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో ల‌క్ష‌న్న‌ర కంటే త‌క్కువ‌గానే యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి కోటీ 17 లక్షల 64 వేల 788 మందికి కరోనా టీకా ఇచ్చారు. గత 24 గంటల్లో దేశంలో 10,584 కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,47,306గా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: