నిరాటంకంగా పెరుగుతూ సెంచరీ మార్క్‌ దాటుతున్న పెట్రోల్‌ ధర.. దానికి అనుగుణంగా పోటీ పడుతూ పెరుగుతున్న డీజిల్‌ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా తాజాగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి 26) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో 8 కోట్ల మంది పాల్గొంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: