60 ఏళ్లు పై బ‌డిన ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా వ్యాక్సిన్ వేస్తున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 60 సంవ‌త్స‌రాలు దాటిన వారు అంద‌రికి క‌రోనా వ్యాక్సిన్ ఉచితంగానే వేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ చెప్పారు. వీరితో పాటు రెండు లేదా అంత‌క‌న్నా ఎక్కువ వ్యాధుల‌తో బాధ‌పడుతోన్న వారికి సైతం 45 ఏళ్లు పై బ‌డి ఉంటే వారికి కూడా క‌రోనా వ్యాక్సిన్ వేస్తున్నామ‌ని చెప్పారు. వీరంద‌రికి కూడా ఉచితంగానే వ్యాక్సిన్ వేస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు.

దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ ఇస్తున్న‌ట్టు చెప్పిన మంత్రి ప్ర‌భుత్వ సెంట‌ర్ల‌లో మాత్రం ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంద‌ని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకునే వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు ఎంత వసూలు చేయాలో మూడు, నాలుగు రోజుల్లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటిస్తుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: