తెలంగాణ ప్ర‌జ‌లు గ‌త యేడాదిగా క‌రోనాతో విల‌విల్లాడారు. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌లు సాధార‌ణ జీవ‌నానికి అల‌వాటు ప‌డుతున్నారు. అయితే ఇప్పుడు సమ్మ‌ర్ ప్రారంభ‌మ‌వుతుండ‌డంతో ప్ర‌జ‌లు విల‌విల్లాడుతున్నారు. మార్చి రాకుండానే తెలంగాణ‌లో ఎండ‌లు మండి పోతున్నాయి. ఇప్పుడే ఇక్క‌డ  సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35- 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 38 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇప్పుడే ఏకంగా 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు అంటే మార్చి మ‌ధ్య నాటికే ఎండ‌లు మ‌రింత‌గా మండిపోనున్నాయి.  హైదరాబాద్‌లోనూ వాతావరణం వేడెక్కుతున్నది. పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ.. ఉక్కతపోత నెలకొంటున్నది. రాత్రి వేళల్లో మాత్రం చలి స్వల్పంగా ఉంటున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బీహెచ్‌ఈఎల్‌ వద్ద 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ‌ల తీవ్రత దృష్ట్యా హైద‌రాబాద్ ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: