విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ జ‌రుగుతోన్న ఉద్య‌మం ఇప్పుడు ఉధృత‌మ‌వుతోంది. ఈ ఉద్య‌మం విష‌యంలో అన్ని పార్టీలు ఏక‌తాటిమీద‌కు వ‌స్తున్నాయి. దీనిపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో.. రోడ్ల దిగ్బంధం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈ ఉద్య‌మం విష‌యంలో ఏపీలో అధికార‌, ప్ర‌తిపక్ష పార్టీలు అన్ని ఒకే తాటిమీద‌కు రావ‌డం విశేషం. ఈ ఉక్కు ఉద్యమానికి మావోయిస్టుల మద్దతు ప్ర‌క‌టించ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఇంత జ‌రుగుతున్నా స్టీల్ ప్లాంట్ విక్రయానికి  కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడడానికి వీల్లేదని రాష్ట్ర బిజెపికి హోం మంత్రి అమిత్ షా ఆదేశం ఇచ్చారు. దీంతో ఏపీ బీజేపీ మ‌రింత ఇట‌కారంలో ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: