ఏపీలో కార్పొరేష‌న్ ఎన్నికలు ఆస‌క్తిగా మారాయి. కీల‌క‌మైన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కమ్యునిస్టులతో పొత్తు పెట్టుకుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, సీపీఐ జనసేనలు కలసి పోటీ చేయనున్నాయి. చెరి రెండు స్థానాలను సీపీఎం, సీపీఎంకు తెలుగుదేశం పార్టీ కేటాయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమం జరుగుతన్న నేపథ్యంలో సీపీఐ, సీపీఎం తో పొత్తు తమకు కలసి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక విశాఖ‌లో బ‌లంగా ఉన్న జ‌న‌సేన‌తో కూడా టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ నాలుగు పార్టీల పొత్తు విశాఖ‌లో ఆ కూట‌మిని ఎంత వ‌ర‌కు గెలిపిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: