అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ భేటీ అవుతుంది. కరోనా వ్యాక్సిన్ రెండో దశ కార్యక్రమం.. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. మార్చి 1 నుంచి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని ఇప్పటికే ఖరారు చేసిన కేంద్రం... ఈ మేరకు సూచనలు చేయనుంది. ప్రస్తుతం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

41 రోజుల్లో 1.34 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చిన ప్రభుత్వం... మార్చి 1  నుంచి 60 ఏళ్ళు పైబడిన వారికి టీకా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాని, గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులందరికీ టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కీలక సమీక్షను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీవ్ భూషణ్ నిర్వహిస్తున్నారు. ఇక కరోన మళ్ళీ తీవ్రం కావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: