చైనాలో వెలుగుచూసిన కరోనావైరస్‌ కారణంగా ఐరోపా దేశాలు మొదటి నుంచి ఎక్కువ ఇబ్బందిపడుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా వెలుగు చూసిన మ‌ర‌ణాల్లో 8.5 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు ఆ దేశాల్లోనే వెలుగు చూశాయి. ఆ తరవాత లాటిన్‌ అమెరికా, కరీబియన్ దేశాల్లో 6,67,972 మంది మృత్యువాతపడ్డారు.  ఐదు లక్షల పైచిలుకు మరణాలతో ఆ జాబితాలో అమెరికా ముందుండగా..బ్రెజిల్, మెక్సికో, భారత్‌, బ్రిటన్‌ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ మ‌ర‌ణాలు 25 ల‌క్ష‌లు దాట‌గా.. మ‌రో 4 నెల‌ల్లో 10 ల‌క్ష‌ల మంది చ‌నిపోతార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక భారత్‌లో మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. వరసగా రెండో రోజు కూడా పాజిటివ్ కేసులు 16వేలకు పైగా నమోదయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: