మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ లో ఓటర్ల జాబితాలో మాయాజాలం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తుంది. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల‌ను మున్సిప‌ల్ అధికారులు తుంగ‌లొ తొక్కారు. ఎన్నిక‌‌ల ప్ర‌క్రియ‌ను అగిన చోట నుంచే మెద‌లు పెట్టాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ చెప్పినా ప‌ట్టించుకోని అధికారులు... అధికార పార్టీ మెప్పు కోసం వైసీపీకి అనుకూల‌మైన వారిని కొత్త ఓట‌ర్ల‌ను జాబితాలో పేర్లు న‌మోదు చేసారు.

ఒక్క వార్డులోనే కొత్తగా 231 మందిని న‌మోదు చేసారు. మిగిలిన వార్ధుల్లో కూడా భారీగా కొత్త ఓటర్లను నమోదు చేసిన అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఇవర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ను క‌లిసి టీడీపీ నాయ‌కులు వివరణ అడిగారు. క‌మిష‌న‌ర్ నుంచి స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేసారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ ను క‌లిసి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: