పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం పనుల మీద ఫోకస్ చేసింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తి అయింది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ మొత్తం పొడవు 1128 మీటర్లుగా ఉంది.  రికార్డు సమయంలో  బ్రిడ్జ్  నిర్మాణం జరిగింది. సెప్టెంబర్ 9, 2020 బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. స్పిల్వే స్లాబ్ నిర్మాణానికి మొత్తం  5200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 700 టన్నులకు పైగా స్టీల్ వినియోగించారు.

గోదావరి వరదల సమయంలోనూ బ్రిడ్జి నిర్మాణం పనులు జరిగాయి. స్పిల్వే బ్రిడ్జి నిర్మాణానికి  పిల్లర్ల పై 192 గడ్డర్లను అమర్చారు. స్పిల్వే బ్రిడ్జ్   పూర్తి స్థాయి ఎత్తు... అంటే 55 మీటర్లకు పూర్తి చేసింది మేఘా సంస్థ. స్పిల్వే నిర్మాణం  లో 2,70,274 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను  మేఘా  ఇంజనీరింగ్ సంస్థ వినియోగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: