తెలంగాణ‌లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. ఈ క్ర‌మంలోనే మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానానికి నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ గ‌డువు కూడా ముగిసింది. దీంతో అధికారులు ఏకంగా 93 మంది బరిలో ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు. భారీ స్థాయిలో అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌డంతో ఈ ఎన్నిక ఆస‌క్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ లు పోటీ చేస్తున్నారు. వీరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: