తెలంగాణ‌లో జ‌రుగుతోన్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. దుబ్బాక‌, గ్రేట‌ర్ దెబ్బ‌తో కేసీఆర్ ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ పార్టీని గెలిపించిన తీరాల‌న్న క‌సితో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ ప్ర‌ధాన మంత్రి పివి. న‌ర‌సింహారావు కుమార్తె సుర‌భి వాణి పోటీ చేస్తోన్న రంగారెడ్డి ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్ ముగ్గురు మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

వ‌చ్చే నెల‌ 14వ తేదీన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరగనుంది. రంగారెడ్డి జిల్లాకు హరీశ్ రావు, మహబూబ్ నగర్ ను ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా బాధ్యతలను గంగుల కమలాకర్ కు అప్పగించారు. పీవీ కుమార్తె  ప్ర‌చారానికి రాక‌పోయినా గెలిపించాల్సిన బాధ్య‌త‌ను కేసీఆర్ ఈ ముగ్గురు మంత్రుల‌పై పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: