విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని త‌న పంతం నెగ్గించుకున్నాడు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 39 వ డివిజ‌న్ పార్టీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి విష‌యంలో ఎంపీ ఒక వైపు... ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, షేక్ నాగుల్ మీరా మ‌రో వైపు చీలిపోయారు. రెండు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. అయితే అధిష్టానం చివ‌ర‌కు నాని మాట‌కే ఓటేసింది. నాని సూచించిన శివ‌శ‌‌ర్మ‌కే బీ ఫామ్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఫ్లోర్ లీడ‌ర్ హ‌రిబాబు కూతురు పూజిత త‌న నామినేష‌న్ ఉప‌సంహారించుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: