విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా సరే కేంద్రం తగ్గడం లేదు. స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ వివరాలను సీక్రెట్ కమర్షియల్ జాబితాలో కేంద్రం చేర్చింది. పెట్టుబడుల ఉపసంహరణ వివరాలను చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం  నిరాకరిస్తుంది. వివరాలు వెల్లడిస్తే కొనుగోలుదార్ల మధ్య పోటీ తత్వం పెరుగుతుందని నీతి అయోగ్ పేర్కొంది.

తాము చేసిన సూచనలను సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించడానికి నీతి అయోగ్ అంగీకరించలేదు. దీనితో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సరే కేంద్రం ఇలా మొండిపట్టుతో ముందుకు వెళ్లడంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. ఇక కేంద్రం వైఖరి దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: