2020-21 సంవత్సరానికి 2553 కోట్ల రూపాయలతో రివైజ్డ్ బడ్జెట్ ని తిరుమల తిరుపతి దేవస్థానం  సిద్దం చేసింది. 3309 కోట్ల అంచనాతో గతంలో బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన టీటీడీ... ఇప్పుడు ఆ బడ్జెట్ ని తగ్గించింది. కరోనా కారణంగా టీటీడీకి ఇతరత్రా ఆదాయాలు భారీగా తగ్గాయి అని వెల్లడించారు. గత ఏడాది హుండి ద్వారా టీటీడీకి 721 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

2021-22  కి 2837 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్దిక శాఖ సిద్దం చేసింది. టీటీడీ చరిత్రలో మొట్ట మొదటి సారిగా గత ఏడాది కంటే బడ్జెట్ తగ్గింది. కరోనా నేపథ్యంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రావడంతో బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ అధికారులు తగ్గించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీలో చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆదాయం పెంచే కార్యక్రమాలను చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: