ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల సందడి ముగిసింది. గ్రామాల్లో పంచాయితీ ఎన్నికల కోసం అధికార విపక్షాలు చాలా తీవ్రంగా కష్టపడ్డాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సర్పంచ్ లుగా మంచి రోజు చూసుకుని ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సమీపంలోని కోరుకొండ (మం)  కాపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు  దర్శనమిచ్చాయి.

ప్రమాణస్వీకారం సందర్బంగా  సంబరాలు  శృతిమించి అమ్మాయిలతో అసాంఘిక డ్యాన్స్ లు చేయించారు నూతన సర్పంచ్, వార్డు సభ్యులు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సర్పంచ్ కూడా డాన్స్ చేసినట్టు సమాచారం. గ్రామాన్ని  మోడల్  విలేజ్ గా  మారుస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారని... అలాంటి ఉపన్యాసాలు చేసిన వేదికపైనే అశ్లీల  డ్యాన్స్ లు వేయించడంపై  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: