తెలంగాణాలో కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుంది. వచ్చే నెల 1 నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. కోవిన్ 2.0 పోర్టల్‌ పై నేడు రేపు ట్రయల్ రన్ ఉంటుంది. మొత్తం 20 రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి డాక్టర్ నుంచి అనుమతి పత్రం ఉంటే మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. తెలంగాణలో 15 లక్షల వ్యాక్సిన్‌ డోసులు సిద్దం చేసి పెట్టుకున్నారు.

టీకా సర్వీస్‌ చార్జీని కేంద్రం ఖరారు చేసి ఉంచింది. టీకా వేయించుకున్నందుకు రూ.100 ఇవ్వాలని పేర్కొంది. అలాగే టీకాకు కూడా ధర అదనంగా ఇవ్వాలి. తెలంగాణా వ్యాప్తంగా 1200 కేంద్రాల్లో టీకాలను ప్రజలకు అందిస్తారు. 232 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉన్నాయి. మిగిలినవి ప్రభుత్వ వైద్య శాలలు. ఒకవేళ ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా తీసుకుని దాని వలన సైడ్ ఎఫెక్ట్ ఉంటే వారే వైద్యం చేయించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: