తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌రిగే నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌పైనే అంద‌రి దృష్టి ఉంది. దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత కేసీఆర్ సైతం ఇక్కడ ఏ ఎన్నిక జ‌రిగినా చాలా అలెర్ట్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్లో సాగ‌ర్ ఉప ఎన్నిక‌పై కేసీఆర్ జ‌రిపిన రివ్యూలో ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దేనని స్పష్టం చేసిన కేసీఆర్.. అందుకు బలం చేకూరే మరిన్ని అంశాల్ని ప్రస్తావించారు.

దుబ్బాక‌లో త‌మ‌కు బీజేపీ ప్ర‌త్యర్థిగా ఉంటే.. సాగ‌ర్లో తాము కాంగ్రెస్‌ను ఢీకొట్టి గెలుస్తున్నామ‌ని చెప్పార‌ట‌. ఈ ఎన్నికల్లో 48 శాతం ఓట్లతో టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 35 నుంచి 36 శాతం ఓట్లు రానున్నాయని.. బీజేపీ అభ్యర్థికి 7-8 శాతం ఓట్లు మాత్రమే రానున్నట్లుగా ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: