దేశ‌వ్యాప్తంగా పెట్రో మంట పెరిగిపోతోంది. గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే ఏకంగా 17 సార్లు పెట్రోల్ ధ‌ర‌లు పెరిగాయి. ఈ పెట్రో మంట దెబ్బకు దేశ‌వ్యాప్తంగా సామాన్య ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇలాంటి టైంలో ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. వ‌చ్చే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. కోవిడ్ ఎఫెక్ట్ వ‌ల్ల గ‌త ఏప్రిల్లో చ‌మురు సంస్థలు త‌మ ఉత్ప‌త్తులు త‌గ్గించాయ‌ని... ఇప్పుడు డిమాండ్ పెర‌గ‌డంతో పాటు ఉత్ప‌త్తి త‌క్కువుగా ఉండ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్టు చెప్పారు. ఇప్పుడు పెట్రో ఉత్ప‌త్తులు పెంచాల‌ని చ‌మురు సంస్థ‌ల‌కు తాము సూచిస్తున్నామ‌ని... చ‌మురు దేశాలు ఉత్ప‌త్తి పెంచితే డిమాండ్‌తో పాటు ధ‌ర కూడా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: