ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు, ఉద్య‌మం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమ‌వారంతో  ఈ ఉద్య‌మం 440వ రోజుకు చేరుకుంది. రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగుతుంద‌ని ప్ర‌భుత్వం చెప్పేవ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌ద‌ని అక్క‌డ ప్ర‌జ‌లు చెపుతున్నారు. క‌రోనా సూచ‌నలు పాటిస్తూ వారు అమ‌రావ‌తి ఉద్య‌మం కొన‌సాగిస్తున్నారు.  

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లో ఉన్న శిబిరాల్లో ఈ ఆందోళ‌న‌లు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని రైతులు మ‌రో స‌రికొత్త డిమాండ్ కూడా తెర‌మీద‌కు తెచ్చారు. విశాఖ ఉక్కు సాధిస్తామని అమరావతి రైతులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: