విజయవాడలో నేటి నుంచి కోవిడ్ మూడో దశ వాక్సిన్ ప్రక్రియ మొదలయింది. 45 నుంచి 60 ఏళ్ల పై వారికి మూడో దశలో కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తారు. గుండె సంబంధిత వ్యాధులు ,ఊపిరితిత్తులు, లివర్, బీపీ,షుగర్ వంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ దశలో కోవిడ్ వ్యాక్సినేషన్ చేస్తారు. సర్వర్లు పనిచేస్తున్నప్పటికీ బుకింగ్స్ స్లాట్ ను స్వీకరించలేదు ప్రభుత్వం.

స్లాట్ బుకింగ్ లేట్ అవడంతో వాక్సిన్ తీసుకోకుండా  వెనుతిరుగుతున్నారు అర్హులు. ఇక ఇదిలా ఉంటే శానిటరీ వర్కర్ దుర్గ కు కోవిడ్ వాక్సిన్ వికటించింది. వైయస్సార్ కాలనీలో నివాసముంటున్న దుర్గ... మూడు రోజుల క్రితం కోవిడ్ టీకాను తీసుకున్నారు. గతంలో తనకు గుండెకు సంబంధించి అనారోగ్యం ఉందని చెప్పిన ఏమి కాదు అంటూ వ్యాక్సిన్ ఇచ్చారని తెలుస్తుంది. వ్యాక్సిన్ వికటించడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఆమె చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: