ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లు అద‌ర‌గొట్టేశారు. టెస్ట్ క్రికెట్లో త‌న మాయాజాలంతో ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌కు చుక్కలు చూపిస్తోన్న స్పిన్న‌ర్ ర‌విచంద్ర అశ్విన్ టాప్ - 3 ప్లేసులోకి వ‌చ్చేశాడు. ఇక గాయం త‌ర్వాత జ‌ట్టులోకి వ‌చ్చిన బూమ్రా ఒక స్థానం త‌గ్గి 9వ ప్లేస్‌లో నిలిచాడు. ఈ లిస్ట్ లో పాట్ కమ్మిన్స్, నీల్ వాగ్నర్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక బ్యాటింగ్‌లో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు టాప్ 10లో ఉన్నారు.  కెప్టెన్ విరాట్ కోహ్లీ యథావిధిగా 836 పాయింట్లతో ఐదో ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్‌లో తొలిసారి బెస్ట్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. పుజారా రెండు స్థానాలు దిగజారి 708 పాయింట్లతో 10 ప్లేస్‌కు పడిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: