దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌తో ఎంతో మంది రాజ‌కీయ నేత‌లు మృతి చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ బీజేపీ ఎంపీ తాజాగా తుదిశ్వాస విడిచారు.
మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనాతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక రెండు రోజులుగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మారింది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఆయ‌న మృతి చెందారు.

చౌహాన్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోడీ సంతాపం తెల‌ప‌డంతో పాటు పార్టీకి ఆయన చేసిన సేవ‌లు ఎన‌లేనివి అని ప్ర‌శంసించారు. చౌహాన్‌ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. నంద‌కుమార్ చౌహాన్ రికార్డు స్థాయిలో అధికారంలో ఉన్నారు. 2009-14 ఐదేళ్ల  కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్  లోక్‌సభ ఎంపీ కొనసాగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: