దివంగ‌త కాపు నేత వంగ‌వీటి మోహ‌న రంగా త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా రివేంజ్ కు రెడీ అవుతున్నారా ?  ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యేపై క‌సి తీర్చుకోబోతున్నారా ? అంటే బెజ‌వాడ టాక్ అవున‌నే అంటోంది. ఇంత‌కు రాధా రివేంజ్ తీర్చుకునే ఆ మాజీ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు. గ‌తంలో వీరిద్ద‌రు కాంగ్రెస్‌లో ఉండేవారు. ప్ర‌జారాజ్యం వ‌చ్చాక వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. 2009 నుంచి వీరు బ‌ద్ధ శ‌త్రువులు అయిపోయారు. పైగా 2009లో విష్ణు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన రాధాను ఓడించారు.

ఆ త‌ర్వాత ఇద్ద‌రు వైసీపీలోకి వెళ్లారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు విష్ణు వ‌ల్లే త‌న‌కు సెంట్ర‌ల్ సీటు రాలేద‌న్న ఆవేద‌న రాధాలో ఉంది. ఆ ఎన్నిక‌ల్లో విష్ణు ఎంట్రీ ఇచ్చాక రాధాను సెంట్ర‌ల్ సీటు వ‌దులుకోమ‌ని.. ఆయ‌న‌కు విజ‌య‌వాడ తూర్పు లేదా బంద‌రు ఎంపీ సీటు ఇస్తామ‌ని అధిష్టానం సైడ్ చేసేసింది. అంత‌కు ముందే వీరి మ‌ధ్య మ‌రో వివాదం వీరిని బ‌ద్ధ శ‌త్రువుల‌ను చేసింది. వంగ‌వీటి రంగా విగ్ర‌హానికి విష్ణు కాంగ్రెస్ కండువా క‌ప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా... అప్పుడు విష్ణ‌పై రాధా వ‌ర్గీయులు దాడి చేశారు.
 
చివ‌రు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సెంట్రల్ సీటు విషయంలో ఇద్దరి మధ్యా తగువు రావడంతో రాధా వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకొన్నారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. జ‌గ‌న్ సైతం రాధాను కాద‌ని విష్ణుకే ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతో రాధా జీర్ణించుకోలేక‌పోయారు. ఇక తాజా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని డివిజ‌న్ల‌లో అయితే టీడీపీ గెల‌వాలి లేక‌పోతే జ‌న‌సేన గెల‌వాలే త‌ప్పా... ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీ గెల‌వ‌కూడ‌ద‌ని రాధా చెపుతున్నార‌ట‌. దీనిని బ‌ట్టే విష్ణుపై రాధా రివేంజ్‌కు రెడీ అవుతున్న‌ట్టే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: