క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌లు మ‌రింత త‌గ్గాయి. మంగ‌ళ‌వారం ఢిల్లీలో 10 గ్రాముల ఒరిజిన‌ల్ బంగారం రేటు రూ. 679 మేరకు తగ్గి రూ. 44,760కి చేరుకుంది. అదేవిధంగా వెండి ధరలకు కూడా భారీగా దిగివచ్చాయి. కేజీ వెండి రేటు రు.  1874 మేర తగ్గి రూ.68,920కి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే బలపడ్డ రూపాయి కారణంగా బంగారం ధరలు దొగొచ్చినట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కొంత కాలంగా బంగారం ధ‌ర‌లు వ‌రుస‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. తాజాగా 45 వేల రూపాలయల మార్కు దిగువకు చేరుకున్నాయి. భవిష్యత్తులో వీటి ధరలు మరింత తగ్గేఅవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: