దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉంటే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎస్బీఐ అధికారులు సైతం త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను అలెర్ట్ చేస్తున్నారు. ఎస్‌బీఐ కస్టమర్లు రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానాస్పద టెక్స్ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా క‌స్ట‌మ‌ర్ల ఫోన్‌కు ఓ మెసేజ్ వ‌స్తుంది. దానిని క్లిక్ చేసిన‌ట్ల‌యితే ఓ న‌కిలీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

ఆ వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీలో పాయింట్లు రీడ‌మ్ చేసుకోవ‌డానికి పేరు, రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, ఎంపిన్ లాంటి వివ‌రాలు అడుగుతుంది. అందులో ఆ వివ‌రాలు ఇస్తే చాలు మీ డేటాను మోసగాళ్లు తస్కరించి మీ బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులు కొట్టేస్తారు. దేశంలో ప‌లు పెద్ద పెద్ద ప‌ట్ణణాల్లో హ్యాక‌ర్లు ఈ మోసాల‌కు పాల్పడిన‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: